స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం.. బహుమతులు అందజేసిన సర్పంచ్

నవతెలంగాణ- రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాలలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్ బహుమతులను అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, వ్యాయమ ఉపాధ్యాయులు శ్రీనివాసల సమక్షంలో విద్యార్థిని విద్యార్థులు వ్యాచారచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించగా, గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్పంచ్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ సమీ, రెంజల్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేందర్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.