‘బాబుతో నేను’ పోస్టర్‌ ఆవిష్కరణ

'Babuto Nenu' poster unveiling– సిగేచర్‌ క్యాంపెయిన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం శ్రేణులు సిగేచర్‌ క్యాంపెయిన్‌ చేపట్టాయి. అలాగే ‘బాబుతో నేను’ పోస్టర్‌ను సైతం ఆవిష్కరించాయి. బుధవారం ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకిలారెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం. పోస్టర్‌ను ఎన్టీఆర్‌ భవన్‌ మెయిన్‌గేట్‌ ఎదుట ప్రదర్శించారు. తెలుగుదేశం కార్యకర్తలేగాక, రోడ్డు వెంట వెళ్లేవారు సైతం చంద్రబాబుకు మద్దతుగా ఈ బ్యానర్‌పై సంతకాలు చేశారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజునాయక్‌, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సాంబశివరావు, రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షులు పోలంపల్లి అశోక్‌, రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి లీలా పద్మావతి ,ఐటీ ఉద్యోగులు, ఎన్టీఆర్‌ భవన్‌ సిబ్బంది, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.