దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్‌ఆర్టీసీ శుభవార్త

TSRTC is good news for those going home for Dussehra– ముందస్తు టికెట్‌ బుకింగ్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్‌ బుకింగ్‌ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. అక్టోబర్‌ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్‌ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్‌ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్‌ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ కొరకు సంస్థ అధికారిక వెబ్‌ సైట్‌ షషష.్‌రత్‌ీషశీఅశ్రీఱఅవ.ఱఅని సంప్రదించాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు.