సబ్బండ కులాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

– బుడగ జంగాల సంక్షేమానికి పెద్ద పీట…
– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ కులాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు శుక్రవారం తోరూర్ లో బేడ బుడగ జంగాల సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోరూర్ మండలంలో బేడ బుడగ జంగాల అభివృద్ధికి తోడ్పడుతానని రెండు కోట్ల రూపాయలతో ఎకరం స్థలంలో సంక్షేమ భవన్ నిర్మాణాని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు సీఎం కేసీఆర్ అన్ని కులాలను వర్గాలను సమంగా చూస్తున్నారని అడుగంటిపోయిన కులవృత్తులకు పునర్జీవం పోసారని ఆయా కులాల వృత్తుల వారిగా ప్రాధాన్యతలను బట్టి ప్రోత్సహిస్తున్నారని నా రాజకీయ జీవితంలో ఇంత గొప్పగా పనిచేసిన ముఖ్యమంత్రిలను చూడలేదని అన్నారు పాలకుర్తి నియోజకవర్గం గతంలో కంటే బాగా అభివృద్ధి చేశానని అన్నారు బేడ బుడగ జంగాలు ఎంతో ఆదర్శవంతమైన జీవనం గడిపే వారు ఎకరం స్థలంలో సామాజిక కేంద్రానికి శంకుస్థాపన చేయడం వారి అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుందని బుడిగజంగాలను బేడ బుడగజంగాలు అని ఇలా రెండు రకాలుగా పిలుస్తారని కథలు చెప్పే వాళ్ళు సినిమాల్లో హీరో లెక్క ఉంటారు గ్రామాల్లో వారి కథలకు మంచి ఆదరణ ఉండేదని మీరు ఒకప్పుడు శివుడి కథలు చెప్పేవారని అందుకే జంగాలు అని పేరు వచ్చిందని అన్నారు గతంలో మత ప్రబోధానికి దేశభక్తికి ప్రతిరూపకంగా నిలబడి పొట్ట పోసుకోవడానికి ఉపయోగపడే వీరు బుర్రకథలు చెబుతూ జీవనం కొనసాగిస్తారని బుడగ జంగాల సంక్షేమానికి పాటుపడడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె శశాంక, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పి ఫ్లోర్ మంగళపల్లి శ్రీనివాస్, డిసిసిబి డైరెక్టర్ కాకిరాలహరి ప్రసాదరావు, రామ సహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, రజక బుడగ జంగాల సంఘాల సామాజిక వర్గాల ప్రముఖులు బాధ్యులు ప్రజలు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు .