– వాస్తవికతను ప్రతిబింబించండి
– పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
– ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టులది కీలకపాత్ర
– జర్నలిస్టుల సంక్షేమానికి ఎమ్మెల్యే కషి అభినందనీయం
– ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
– నియోజకవర్గ పరిధిలోని 100 జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ
నవతెలంగాణ-పటాన్‌చెరు
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారిదిగా పనిచేస్తూ, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎల్లప్పుడు పెద్దపీట వేస్తున్నారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటా న్‌చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురు వారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో.. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న 100 మంది జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. వారితోపాటు కాజిపల్లి గ్రామా నికి చెందిన 30 మంది రోడ్డు నిర్వాసిత బాధితులకు పట్టాల ను అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావే శంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సోషల్ మీడియా మూలంగా మీడియా వార్త కథనాల విశ్వస నీయత ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశా రు. వాస్తవికతను ప్రతిబింబించేలా కథనాలు ఉండాలని కోరారు. ప్రభుత్వాలు చేపట్టే అభివద్ధి, సంక్షేమ పథకాల అమలులో లోటుపాట్లు ఉంటే వార్తల ద్వారా తెలియ చేయా ల్సిన గురుతర బాధ్యత మీడియాపై ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 68 ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. మొదటి విడతగా ప్రభుత్వ గుర్తింపు కలిగిన జర్నలి స్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, రెండో విడతలో అర్హులై ఉండి అక్రిడేషన్ కార్డు లేని జర్నలి స్టులకు సైతం ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూంలు అందజే స్తా మని హామీ ఇచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉం టున్నామని.. గతేడాది రూ.60లక్షల సొంత నిధులతో 100 మంది జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించినట్టు గుర్తు చేశారు.. భవిష్యత్తులోనూ అండగా ఉంటామన్నారు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కషి అభినందనీయం : ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ
పటాన్‌చెరు నియోజకవర్గంలో జర్నలిస్టుల సంక్షేమా నికి ఎమ్మెల్యే కషి అభినందనీయమని ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ ప్రశంసించారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా 60 లక్షల రూపాయలతో జర్నలిస్టుల కోసం ఆరోగ్య బీమా చేయించడం చారిత్రాత్మకమని అన్నా రు. దీంతోపాటు సొంతింటి కలను సాకారం చేసేలా ఒకే సారి వందమంది జర్నలిస్టులకు అత్యంత ఖరీదైన ప్రాంతా ల్లో ఇంటి స్థలాలు కేటాయించడం వ్యక్తిగతంగా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. భవిష్యత్తులోనూ జర్నలి స్టుల సంక్షేమానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ జర్నలి స్టు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అనంత రం మండలాల వారిగా పూర్తి పారదర్శకతతో డ్రా పద్ధతి ద్వారా ప్లాట్లను కేటాయించారు. అనంతరం ఇళ్ల స్థలాల పట్టా లను పంపిణీ చేశారు. పట్టాలను మహిళలకు అందిం చడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ విజరు కుమార్, జెడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్లు తుమ్మల పాండురంగారెడ్డి, లలిత సోమిరెడ్డి, రోజా బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.