పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్

నవతెలంగాణ- తాడ్వాయి
తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్ శనివారం రోజున మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడుతూ వరి, మొక్కజొన్న, పత్తి మరియు సోయాచిక్కుడు క్షేత్రాలను సందర్శించరు.. పంటల్లో గమనించిన చీడపీడలు అలాగే పోషక లోపాలు సవరణ వివరాలను రైతులకు సూచించారు. ముఖ్యంగా వరిలో కాండం తొలచు పురుగు ఉదృతని గమనించి దాని నివారణకు రైతులు పాటించవలసిన మెలకువలను సూచించారు. వరి లో కాండం తొలుచు పురుగు ఉధృతి ని గమనించడం జరిగింది. నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రా లెదా క్లొరాంట్రనిలిప్రోల్ 60 ml పిచికారీ చేసుకోవాలి. సోయా చిక్కుడులో పల్లాకు తెగులు గమనించడం జరిగింది. దీని నివారణకు ఎకరానికి 300g అసిఫేట్ లేదా ఎకరానికి 40g అసిటామాప్రిడ్ పిచికారి చేసుకోవాలని సూచించడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ సూచించిన విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పంటను వివిధ రకాల చీడపీడలు నుండి కాపాడుకుని మంచి దిగుబడి సాధించే అవకాశం ఉందని రైతులకు వివరించడం జరిగింది. కార్యక్రమంలో విస్తీర్ణ అధికారులు రాకేష్ , సొసైటీ డైరెక్టర్ రాజిరెడ్డి , రైతులు మనోజ్ కుమార్ , బాపురావ్ , నరేష్ తదితరులు పాల్గోన్నారు.