ఎన్నికల కోడ్ ముందే పిఆర్సి ని ప్రకటించాలి!

నవతెలంగాణ -కంటేశ్వర్ 

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, 30% ఇంటీరియమ్ రిలీఫ్ తో  పే రివిజన్ కమిటీని ప్రకటించాలని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నాందేవ్ వాడలోని పెన్షనర్స్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..జూలై 23 సంవత్సరం నుండి చట్టబద్ధంగా రాష్ట్రంలో పిఆర్సి అమల్లోకి రావాలని, పెండింగ్ లో ఉన్న మూడు విడతల డీఏలను విడుదల చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమును పటిష్ట పరిచి నగదు రహిత వైద్యాన్ని అన్ని ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రులలో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు శాస్త్రుల దత్తాద్రిరావు జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ రావు, రాధా కృష్ణ ,జిల్లా కార్యదర్శి మదన్ మోహన్, కోశాధికారి ఈవీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.