మండలంలోని వెల్లికట్టే గ్రామంలో అభివృద్ధి పనులను స్థానిక సర్పంచ్ పోసాని పుష్పలీల 10 లక్షల రూపాయలతో పెద్దమ్మ తల్లి గుడి ఆవరణలో సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి గుడిలో సిసి రోడ్డు కావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను కోరగా వెంటనే పనులు ప్రారంభించుకోవచ్చని తెలుపడంతో ఆదివారం రోజు సిసి రోడ్డును ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బత్తుల మల్లమ్మ,మాజీ సర్పంచ్ కోమాండ్ల దామోదర్ రావు,ఉప సర్పంచ్ దీకొండ యాకన్న, గ్రామ పార్టీ అధ్యక్షులు తక్కల్లపెల్లి దేవేందర్ రావు, సొసైటీ చైర్మన్ కొమ్ము సోమయ్య, కుల పెద్ద కొమ్ము రాములు, వార్డు సభ్యులు పబ్బాల రాము, ముఖ్య నాయకులు పోసాని రాములు , బత్తుల యాకయ్య, కోమాండ్ల లింగారావు, దీకొండ రాంబాబు, కొమ్ము రాములు, కొమ్ము యాకయ్య, అనపురం వెంకన్న, దీకొండ బాలకృష్ణ,కొమ్ము మల్లయ్య, కొమ్ము అశోక్, కొమ్ము వినయ్, కొమ్ము కుమారస్వామి, కొమ్ము ఎల్లయ్య, వెంకన్న,సోమయ్య, కనుకుట్ల కుమార్,యువకులు అనిల్, భరత్, శేఖర్, వెంకటేష్ ముదిరాజు కులస్థులు పాల్గొన్నారు.