సీఎం కేసీఆర్ మనస్సు మారాలని

– అంగన్వాడీలు వనదేవతలకు పూజలతో..
– వినూత్న నిరసన
నవతెలంగాణ- తాడ్వాయి
మండల కేంద్రంలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. 14వ రోజు ఆదివారం అంగన్వాడీలు తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని, తాడ్వాయి మండల కేంద్రంలోని మేడారం హార్చి గేటు వద్ద, సీఎం కేసీఆర్, గిరిజన స్ర్తీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి ల మనస్సు మారి మాకు ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని డప్పు చప్పులతో ఆర్చి గేటు వద్దకు చేరుకొని వినుత్నంగా నిరసన తెలిపారు. సమ్మక్క- సారలమ్మ వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కురేందల సమ్మక్క మాట్లాడుతూ గతంలో సీఎం కేసీఆర్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. అంగన్వాడి ఉద్యోగులకు 26 వేల వేతనం ఇవ్వడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలన్నారు భద్రత సౌకర్యాలు కల్పించాలన్నారు. సుప్రీంకోర్టు ప్రకారం రాష్ట్రంలోనే అంగన్వాడీ ఉద్యోగులకు గ్రావిటీ చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల అధ్యక్షులు జమున అంగన్వాడీ యూనియన్ నాయకులు సరిత, రుక్మిణి, నిర్మల, వెంకటలక్ష్మి, రమ, అంగన్వాడి టీచర్లు, ఆయాలు సమ్మక్క, రాజమ్మ, సత్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.