కబ్జాకు గురవుతున్న వాగులు, కుంటలు

నవతెలంగాణ-ఆదిభట్ల
ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీ పటేల్‌గూడా గ్రామంలో కుంటలు, వాగులు కబ్జాకు గురువుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎంపీ పటేల్‌ గూడా గ్రామంలో 96 సర్వే నెంబర్‌లో ఉన్న గ్రామకంఠం భూమి 4 ఎకరాల 16 గుంటలు భూమి ఉంది. అయితే ఆ భూమిలో కొంత మేరకు కుంటలు, వాగులు ఉన్నాయి. అయితే ఆ కుంట సమీపంలో ఉన్న భూమిని కొందరు సుమారు ఎకరం వరకూ ఆక్రమించారని పలువురు ఆరోపి స్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు పలుమార్లు తెలియజేసినా పట్టించుకోవడం లేదు. గతంలో ఆ భూమిలో రాళ్లూ, ముండ్ల చెట్లు, కుంటలు ఉండటంతో గతంలో ఉపాధి పనులు చేపట్టి చదును చేశారు. కానీ ఇప్పుడూ ఆ ప్రదేశమంతా నిర్మాణుష్యంగా మారింది. ఆ భూమి ఈ సమీపంలో ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజీ వారు, రాజకీయ నాయకుల అండదండలతో అక్రమించు కున్నారని స్థానికుల గుసగుసలు వినపడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించకుండా సరి హద్దులు వేసి, ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అయితే బొంగులూరు గేట్‌ నుంచి పటేల్‌గూడాకు వెళ్లే దారిలో శ్రీశ్రీ అంతపురం వెస్ట్‌ కాలనీ నుంచి ఈ కుంటలోకి రావాల్సిన వర్షపు నీరు రోడ్డుపై నిలబడుతుంది. ఆ కుంట పక్కనే ఉన్న విశ్వే శ్వరయ్య కళాశాల యాజమాన్యం ప్రహరీ నిర్మిం చింది. దీంతో ఆ సమీపంలో ఎలాంటి కల్వర్టులు నిర్మించకపోవడంతో కుంటలోకి పోవాల్సిన వర్షం నీరు రోడ్డుపైనే నిలుస్తుంది. దీంతో పాదాచారులకు , ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. ఈ సమస్యపై అధికారులు స్పందించి, శాశ్వత పరిష్కారం చూపాలని పటేల్‌గూడా గ్రామస్తులు కోరుతున్నారు. పటేల్‌గూడా నుంచి ఇబ్రహీంపట్నం చెరువులోకి వెళ్లే వాగు సర్వే నెంబర్‌ 510, 512లో నుంచి ప్రవహిస్తుంది. ఈ నాలా కబ్జాకు గురి అవుతుందని స్థానిక రైతులు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పర్మిషన్‌ లేకుండా ఇసుక అక్రమంగా తరలించి, తీసిన ఆ గుంతల్లో రాళ్లు వేసి పూడ్చడం ఆనవాయితీగా మారుతోంది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని నీటి నాలా,వాగును కాపాడాలని రైతులు కోరుతున్నారు.
నీటినాలా,వాగును కాపాడాలి
ప్రభుత్వ భూమి అక్రమా లకు గురికాకుండా చూడాలి. అంతేకాకుండా ఇసుక అక్ర మంగా తరలించి, తీసిన ఆ గుంతల్లో రాళ్లు వేసి పూడ్చడం ఆనవాయితీగా మారుతోంది. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని నీటి నాలా,వాగును కాపాడాలని రైతులు కోరుతున్నారు.
తొంట రమేశ్‌, బీఆర్‌ఎస్‌ మండల నాయకులు