కేసీఆర్‌ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

– ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేసీఆర్‌ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో తులేకలాన్‌లో రూ.92లక్షల వ్యయంతో నిర్మించిన జై భీమ్‌ కమ్యూనిటీ హల్‌, రెడ్డి కమ్యూనిటీ హాల్‌, డ్వాక్రా భవనం, డ్రయినేజీ, రోడ్లతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ,రాష్ట్ర పోలీస్‌ శాఖ అదనపు డీజీపీ బత్తుల శివధర్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధిని గాలికొదిలేశాయన్నారు. కనీసం చనిపోతే ఖననం చేసుకునేందుకు కూడా స్థలంలేని దుస్థితి ఏర్పడేది అన్నారు. కానీ కేసీఆర్‌ నాయకత్వంలో శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించారని తెలిపారు. చెత్తచెదారం లేకుండ గ్రామాలు సుందరంగా తయారవుతున్నాయని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల్లోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. కల్యాణలకిë, షాదీముబాకర్‌, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలను కేంద్రం కాపీ కొడుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ద్వారా సాగు నీరురానుందన్నారు. ఈ తరుణంలో మరో సారి కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్‌ సత్తు వెంకటరమణరెడ్డి, ఎంపీపీ పి. కృపేష్‌, సర్పంచ్‌ చిలుకల యాదగిరి, ఎంపీటీసీ నాగటి నాగలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు చిలుకల బగ్గరాములు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.