నవతెలంగాణ-జోగిపేట
సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఆదివారానికి 14వ రోజుకు చేరింది. కాగా ప్రభుత్వం స్పందించి.. సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె విరమింపబోమని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. జోగిపేటలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమెల మాణిక్యం పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలం చెందా రన్నారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదన్నారు. తక్షణమే అంగన్వాడి ఉద్యోగు లతో యూనియన్లతో చర్చలకు ప్రభుత్వం అధికారులు ముం దుకు రావాలన్నారు. అంగన్వాడీల పైన బెదిరింపులు ఆపాల ని డిమాండ్ చేశారు. వారి పోరాటానికి అండగా ఉంటామ న్నారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్, అంగన్వాడీలు ఇందిర, శేకమ్మ, అరుణ, శోభారాణి, సాయ మ్మ, హిమబిందు, సుమిత్ర, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
సదాశివపేట : అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వి. ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా ఆదివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి వినాయక విగ్రహానికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 14 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించ కపో వడం దుర్మార్గమన్నారు. అలాగే అంగన్వాడీ సిబ్బంది పట్ల అబద్ధపు ప్రచారాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఇప్పట ికైనా స్పందించి.. అంగ న్వాడీల సమస్యలు పరిష్కరించాల న్నారు. అంగన్వాడీ యూ నియన్ నాయకులు సంగీత, లక్ష్మి, ఇందిరా, విజయలక్ష్మి, మహేశ్వరి, మౌనిక, సంగీత, కల్పన, అనురాధ, తదితర టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు.
కొండాపూర్ : మండల కేంద్రంలో చేపట్టిన సమ్మెలో ఆదిy ారం ఆకులు తింటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ కొండాపూర్ మండల కన్వీనర్ బాబురావు మాట్లాడుతూ.. గత 14 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ఏండ్ల తరబడి పనిచేస్తున్నా.. కనీస వేతనం అమలు చేయకపోవడం, పర్మినెంట్ చేయకపోవడం దుర్మార్గ మన్నారు. ఇప్పసటికైనా ప్రభుత్వం స్పందించి.. అంగన్వాడీల న్యాయమైన డిమాం డ్‌లను పరిష్కరించాలన్నారు. ఈ కార్య క్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు భ్రమరాంబ, అరుణ, శశికళ, భ్రమ రాంబ, శాంతమ్మ, సునంద, ప్రమీల, అనసూజా తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌రూరల్ : భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఖేడ్‌లో 14వ రోజు అంగన్వాడీలు సమ్మె చేపట్టారు. మానవహారం చేపట్టి.. నిరసన తెలియజేశారు.