– ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా
– మళ్లీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి
– ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
నవతెలంగాణ-పుల్కల్
అందోల్ నియోజకవర్గాన్ని అభివద్ధి బాటలో నడపడమే తమ ధ్యేయమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. పుల్కల్ మండల పరిధిలోని ఎస్ ఇటిక్యాల గ్రామంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఇనాం భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తమది కల్లబొల్లి మాటలు చెప్పే ప్రభు త్వం కాదని.. చెప్పిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి తీరుతామన్నారు. గత 60 ఏండ్లుగా అభివద్ధికి నోచుకోని గ్రామాలు.. కేవలం తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ గడపకు ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అందించిన ఘనత తమ అధినేత కేసిఆర్‌కే దక్కిందన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. న్యిం ప్రజా శ్రేయస్సుకు కృషి చేస్తున్నామన్నారు. కాగా ఇటిక్యాల గ్రామస్తులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కళ నేడు సహకారం అయింద న్నారు. సుమారు 418 మందికి ఇనాం భూముల పట్టాలు అందజేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఒక్కసారి అవకాశం ఇస్తే ఆందోల్ నియోజకవర్గం రూపు రేఖలనే మార్చేస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు చంటి రాహుల్ కిరణ్, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు మాచర్ల విజరు కుమార్, ఆత్మ కమిటీ మండలాధ్యక్షులు యాదగిరి రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పల్లె సంజీవయ్య, ఇటిక్యాల గ్రామ సర్పంచ్ మన్నే రాదయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పడమటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.