నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో రెడ్డి సంఘ భవన నిర్మణానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రూ.10 లక్షలు మంజూరీ చేసినట్టు రెడ్డి జేఏసీ యువజన మండలాధ్యక్షుడు మిట్టపెల్లి చెన్నారెడ్డి తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే కార్యలయంలో రెడ్డి జేఏసీ నాయకులు ఎమ్మెల్యే రసమయిని మర్యాదపూర్వకంగా కలిసి వీరాపూర్ గ్రామంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి విజ్ఞప్తి చేశారు.తక్షణమే ఎమ్మెల్యే రసమయి స్పందించి భవన నిర్మాణానికి నిధులు మంజూరీ చేయడం హర్షనీయమని రెడ్డి జేఏసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.అనంతరం వీరాపూర్ గ్రామ రెడ్డి నాయకులు ఎమ్మెల్యేను శాలువ కప్పి సన్మానించారు.మండల బీఆర్ఎస్,రెడ్డి జేఏసీ నాయకులు పాల్గొన్నారు.