‘పెదకాపు-1’లో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నా పాత్రే కాదు ఇందులో ఉండే పాత్రలన్నీ కథలో చాలా కీలకం. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమాలు చూశాను. ఆయన సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. ఇందులో కూడా నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది’ అని నాయిక ప్రగతి శ్రీవాస్తవ అన్నారు. విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ మీడియాతో ముచ్చటించారు.
ఆ విశేషాలు..
‘పెదకాపు కథ శ్రీకాంత్ చెప్పినప్పుడు మొదటి నుంచి చివరి వరకూ మంచి సస్పెన్స్‌తో చాలా క్యాచీగా అనిపించింది. ‘మనుచరిత్ర’ తర్వాత నేను చేసిన సినిమా ఇది. ఇందులో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దీనిలో సవాల్‌తో కూడిన పాత్ర చేయడం ఒక నటిగా నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ పాత్ర చాలా సహజంగా వచ్చింది. ఈ పాత్రలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. విరాట్ కర్ణ చాలా సపోర్టివ్ కోస్టార్. ఈ సినిమాలో తన పాత్ర ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.
ప్రస్తుతం ‘గంగం గణేశా’ చేస్తున్నా’. అలాగే కొన్ని కథలు ఇప్పటికే విన్నా’.