బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి అభివృద్ధి‌కి ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లోకి వలసలు

నవతెలంగాణ-కొత్తూరు
మండల పరిధిలోని కొడిచర్ల గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు ఎంపీటీసీ రవీందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు మెండే కష్ణ యాదవ్‌ ల ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రైతన్నలకు ఉచిత కరెంటు, ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, వద్ధులకు, వికలాంగులకు ఆసరా, కాలేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను చూసి ఆకర్షితులవుతున్నారని తెలిపారు. తెలంగాణ అభివద్ధికి అహర్నిశలు కషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు అండగా ఉండేందుకు వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో కొడిచర్ల ఎంపీటీసీ రవీందర్‌ రెడ్డి, దన్నాడ జంగయ్య యాదవ్‌, మండల రైతు కోఆర్డినేటర్‌ కళ్లెం నరసింహారెడ్డి, పంపుల నరసింహ గౌడ్‌, బీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షులు జంగయ్య యాదవ్‌, నాయకులు చెన్నయ్య యాదవ్‌, శేఖర్‌, వినరు, కళ్లెం మాణిక్య రెడ్డి, మాజీ సర్పంచ్‌ సీతారాం, మంగలి జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.