– పథకాలన్ని అధికార పార్టీ అనుయాయులకేనా
– లబ్ధిదారుల ఎంపిక లో గ్రామ సభల ఊసే లేదు
– ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు
– సీపీఐ(ఎం) ఎండి. జహంగీర్
నవతెలంగాణ – భువనగిరి
రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న పథకాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన పేద ప్రజలకా లేక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకా అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం భువనగిరిలో ప్రభుత్వ పథకాల అమలు విషయంలో రాజకీయ జోక్యం అరికట్టి గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలు అమలయ్యే విధంగా చూడాలని ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధు, సామాజిక తరగతులకు ఆర్థిక సహాయం, గహలక్ష్మి పథకంలో బీఆర్ఎస్ నాయకుల జోక్యం పెరిగి పేదవారికి ప్రభుత్వ పథకాలు అందకుండా పోతున్నాయన్నారు. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదన్నారు. గ్రామాల్లో అనేకమంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయన్నారు. వీరిని ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించకుండా అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనంగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమై అధికారులు ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు.గ్రామ పంచాయతీల పాత్ర ఈ పథకాల అమలులో శూన్యమన్నారు. ప్రభుత్వ పథాకాలలో నాయకుల జోక్యం పెరిగిందన్నారు. పథకాలకు అర్హులు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పథకాలన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన నిర్వహించిన నిరసన దీక్షలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, సిరిపంగి స్వామి, దయ్యాల నరసింహ మాయ కష్ణ ,బొల్లు యాదగిరి ,మద్దెల రాజయ్య ,ఎండి పాషా, జల్లల పెంటయ్య ,బొడ్డుపల్లి వెంకటేష్, గుంటూర్ శ్రీనివాస్‌చారి ,గుండు వెంకటనర్సు, గంగదేవి సైదులు, బండారు నరసింహ, మద్దెపురం రాజు, బొలగని జయరాములు, గడ్డం వెంకటేష్, ఎంఏ ఇక్బాల్ ,వనం ఉపేందర్,ప్రజా సంఘాల నాయకులు వనం రాజు, ఈర్లపల్లి ముత్యాలు, కల్లూరి నాగమణి, బొడ భాగ్య, అనాజిపురం సర్పంచ్ ఏదునూరి మల్లేష్, వెల్లంకి ఎంపిటిసి కూరెల్ల నరసింహాచారి, వడ్డేబోయిన వెంకటేష్ పాల్గొన్నారు.