– డీఎంహెచ్‌ఓ హర్షవర్థన్
నవతెలంగాణ-కోదాడరూరల్
దోమలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని గుడగుంట్ల అప్పయ్య ఫంక్షన్‌హాల్‌లో దోమల ద్వారా వ్యాపించి వ్యాధుల పైన వాటిని అరికట్టుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు డెంగ్యు జ్వరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.దోమలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలన్నారు.దోమతెరలు వాడాలన్నారు. దోమలు కుట్టకుండా చిన్నపిల్లలకు దుస్తులు, శరీరం మొత్తం కప్పి ఉంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నిరంజన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కీటక జనతా వ్యాధులజిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాహితీ, మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ నాజియా, మున్సిపల్ వైస్‌చైర్మెన్ వెంబటి పద్మ, కౌన్సిల్ లలిత, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు,సూపర్వైజర్లు ఆరోగ్య కార్యకర్తలు,వార్డ్ ఆఫీసర్,వార్డ్ జవాన్లు ,ఆశా కార్యకర్తలు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.