– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు
నవతెలంగాణ- భువనగిరిరూరల్
అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొండివైఖరి వీడాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మెశిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించి మాట్లాడారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామా కుమారి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నరసింహ అంజయ్య వెంకటేశం, మండలంలో ఉన్న ఆయాలు టీచర్లు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : అంగన్వాడి టీచర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆలేరు మండల అధ్యక్ష ,కార్యదర్శులు జూకంటి. పౌల్ , బొమ్మకంటి .లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె శిబిరం వద్ద దాత పాలగుండ్ల స్వామి సౌజన్యంతో అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనమివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి , గంగుల. రమ, పద్మ ,లక్ష్మి ,మండల కన్వీనర్ సంఘీ రాజు , కేతవతు లక్ష్మి , శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని చేపట్టిన సమ్మెనుకు మంఘళవారం టీపీసీసీ బీర్ల ఐలయ్య మద్దతు తెలిపారు. మంగళవారం బీర్ల ఐలయ్య సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కనీస వేతనం 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఖర్చుల నిమిత్తం కోసం పదివేల రూపాయలను విరాళం అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, గంధ మల్ల. అశోక్,జిల్లా. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం. పద్మా వెంకటస్వామి, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎంఏ. ఎజాజ్, పద్మా, వెంకటస్వామి, మల్లయ్య, యాదగిరి,బీజని. భాస్కర్, శ్రీశైలం, ఉప్పలయ్య, నరసింహులు పాల్గొన్నారు.
పట్టణంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, ఆలేరు అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు మొరిగాడి రమేష్మాట్లాడారు. కేజీ కేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు దూపటి. వెంకటేశు సమ్మె కి మద్దతు తెలిపారు.ఈ
కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిజూకంటి పౌలు, ఆ సంఘం మండల అధ్యక్షులు, బొమ్మ కంటి లక్ష్మీనారాయణ , మండల కార్యదర్శి సంగీరాజు, గంగుల రమ, లక్ష్మీ, పద్మ, సంపూర్ణ, విజయ ,శాంత ,సరిత, సిహెచ్ సరిత, ఉపేంద్ర ,నరసమ్మ, సుగుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ సీనియర్ నాయకులు గూడూరు అంజి రెడ్డి అన్నారు మంగళవారం సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులతో కరోనా సమయంలో అనేక సేవలు చేయించుకొని వారికి కనీస వేతనాలు ఇవ్వకుండా 26 వేల ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సునంద వసంత ప్రమీల పారిజాత రుక్మిణి మంగ మంజుల శశిరేఖ సంతోష లక్ష్మమ్మ మంగ పరమేశ్వరి కవిత రాణి పాల్గొన్నారు
బీబీనగర్ : అంగన్వాడీ ఉద్యోగులపై అధికారుల వేధింపు లు ఆపాలని సీఐటీయూ మండల కన్వీనర్ గాడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారంఅంగన్వాడీ ఉద్యోగులు సమ్మె శిబిరం నుండి అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా బయలుదేరి విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో షాహేద, ధనలక్ష్మి, శోభారాణి, పద్మ, విశాల, లక్ష్మి ,సుజాత, రేణుక, రాధిక ,లక్ష్మీ, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కనీస వేతనాలు అమలుచేయాలని కోరుతూ మంగళవారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టీచర్లు, ఆయాలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్‌డి.పాషా మాట్లాడారు. టీచర్లకు 26వేలు, ఆయాలకు 18వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సఫియా, జయప్రద, సుజాత, అయిలమ్మ, జయలక్ష్మీ, నజీమున్నీసా, అమత, ఉపేంద్ర, వసంత, రమ్య, కరుణ, పారిజాత పాల్గొన్నారు.
రాజాపేట: మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుటఅంగన్వాడీల సమ్మెకు కాంగ్రెస్ మండల యువజన విభాగం అధ్యక్షులు ఇంజ నరేష్ మద్దతు తెలిపారు. అదే విధంగా ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాపేట మండల పార్టీ అధ్యక్షులు నెమలి మహేందర్ గౌడ్ , వెంకటాపురం ఎంపిటిసి ఎర్రోళ్ల బాబు స్వరూప, రాజాపేట టౌన్ అధ్యక్షులు నవీన్ కుమార్ మేడిశెట్టి సురేష్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ , నరసింహ ,వీరయ్య, నరసింహులు, బేగంపేట పాండు, తదితరులు పాల్గొన్నారు.