నవతెలంగాణ- సిరిసిల్ల రూరల్:
ఆశ వర్కర్లు చేపట్టిన నిరవదిక సమ్మె మంగళవారంకు రెండవ రోజుకు చేరుకుంది. అంబేద్కర్ చౌక్ నుండి నేతన్న చౌక్ మీదుగా గాంధీ చౌక్ వరకు ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. అంబేద్కర్ కూడలిలో టెంట్ లేకుండానే ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వద్ద ఎండలోనే కూర్చొని తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేశ్, ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు భారతీ లు మాట్లాడుతూ ప్రభుత్వం ఆశ వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ తగిన వేతనం చెల్లించడం లేదన్నారు. ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని లేకుంటే రాబోయే రోజుల్లో సమ్మెను ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తల ప్రతినిధులు మంజుల, జయశీల, రేణుక, కస్తూరి, చంద్రకళ, లావణ్య, గాయత్రి, లత, హెప్సి, రుచిత, రాణి తదితరులు పాల్గొన్నారు.