– తొమ్మిది బంతుల్లోనే అర్ధసెంచరీ కొట్టిన నేపాల్ బ్యాటర్
ఆసియా క్రీడల పురుషుల క్రికెట్లో నేపాల్ జట్టు కెప్టెన్ విధ్వంసం సృష్టించింది. గ్రూప్-ఎలో భాగంగా జరిగిన ఈ పోటీలో నేపాల్ కెప్టెన్ కేవలం 9బంతుల్లోనే అర్ధసెంచరీ కొట్టి యువరాజ్ సింగ్(11బంతుల్లో అర్ధసెంచరీ) పేరిట ఉన్న రికార్డును బ్రద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 20ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. నేపాల్ ఆటగాడు కుషాల్ మల్ల (50బంతుల్లో 137నాటౌట్; 8ఫోర్లు, 12సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. కెప్టెన్ రోహిత్ పడేల్ (27బంతుల్లో 61; 2ఫోర్లు, 6సిక్సర్లు) అర్ధసెంచరీతో మెరిసాడు. ఇక చివర్లో దీపేంద్ర సింగ్ (10బంతుల్లో 52నాటౌట్; 8సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఛేదనలో మంగోలియా జట్టు 41 పరుగులకే ఆలౌటైంది. దీంతో నేపాల్ జట్టు 273 పరుగుల తేడాతో మంగోలియాపై ఘన విజయం సాధించింది. టి20 ఫార్మాట్లో ఇదే అతి పెద్ద విజయం.
టి20 ఫార్మాట్లో నమోదైన ప్రపంచ రికార్డులివీ..
అంతర్జాతీయ టి20ల్లో ఒక జట్టు 300కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి.
కుషాల్ మల్ల 34 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అంతర్జాతీయ టి20ల్లో ఇదే వేగవంతమైన సెంచరీ. రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్(35 బంతుల్లో) రెండో స్థానంలో ఉన్నారు.
ఈ ఫార్మాట్లో 9బంతుల్లోనే అర్ధసెంచరీ చేయడం ఇదే తొలిసారి. దీపేంద్ర సింగ్ మంగోలియాపై కొట్టి చరిత్రకెక్కాడు. దీంతో 2007 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో అర్ధసెంచరీ రికార్డు బ్రద్దలైంది.
ఈ ఫార్మాట్లో ఇదే అతిపెద్ద విజయం. 273 పరుగుల తేడాతో నేపాల్ జట్టు మంగోలియాపై నెగ్గింది. గతంలో చెక్ రిపబ్లిక్ జట్టు టర్కీపై 257 పరుగుల తేడాతో గెలుపొందింది.
520-ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ స్ట్రయిక్‌రేట్ ఇది. అంతర్జాతీయ టీ20ల్లో పది కంటే ఎక్కువ బాల్స్ ఆడిన ప్లేయర్లలో ఇదే అత్యధిక స్ట్రయిక్‌రేట్.
26 సిక్సర్లలో అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఇదే అత్యధికం. గతంలో ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్థాన్ 22 సిక్సర్లు బాదింది.