భయపెట్టే కలియుగం

Frightening Kaliyugaశ్రద్ధా శ్రీనాథ్‌, ‘ కాంతార’ ఫేమ్‌ కిషోర్‌ నటించిన చిత్రం ‘కలియుగం’. 2064లో ఈ మానవాళికి ఏమవుతుంది?, ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? అనే అంశాల ఆధారంగా ఇండియాలోనే తొలిసారి పోస్ట్‌ అపోకలిప్స్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని ఆర్‌ కె ఇంటెర్నేషనల్‌ బ్యానర్‌లో కె ఎస్‌ రామకష్ణ నిర్మిస్తున్నారు. ప్రకటనల రంగంలో ఎన్నో యాడ్స్‌కి డైరెక్టర్‌గా పనిచేసిన ప్రమోద్‌ సుందర్‌ తొలిసారిగా మెగా ఫోన్‌ పట్టి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు రాని కథతో హర్రర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్‌ కానుంది.