కేంద్రం ఇవ్వదు.. రాష్ట్రం అడగదు

Center does not give.. State does not ask– బీఆర్‌ఎస్‌, బీజేపీ బంధమిది !
– రోడ్లు, సాగునీటి, భగీరథ శాఖలకు అందని కేంద్రం సాయం
– ఒక్క కేవీని ఇవ్వని వైనం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేం డ్లుగా వివక్షను కొనసాగిస్తూనే ఉంది. పైసా విదల్చడం లేదు. చివరకు ఇటీవల మంజూరు చేసిన కేంద్రీ య విద్యాలయాలను సైతం తెలంగాణకు ఒక్కటీ ఇవ్వని దుస్థితి ఏర్పడింది. తెలంగాణ పట్ల మోడీ సర్కారు సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నది. మాటలు చెబు తూ కాసులు ఇవ్వకుండా కరు కుగా వ్యవహరిస్తున్నది. సైం ధవుడిలా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నది. ఆయా పథకాలకు అత్తెసరు సాయంతో కాలయాపన చేస్తున్నది. సాగునీటి ప్రాజె క్టులు, జాతీయ రహదారు లు, భగీరథ శాఖ, విద్యా సంస్థలు, ఇతర అంశాల్లో పూర్తి గా శీతకన్నేసింది. జాతీయ ప్రాజె క్టులేవీ రాష్ట్రానికి మంజూరు చేయ కుండా తొక్కి పట్టింది. స్వార్థ రాజ కీయమే తప్ప ప్రజా సంక్షేమాన్ని గాలి కొది లేసింది. చిత్తశుద్ధి కరు వైంది. ఇదిలా వుండగా ఎన్నికలు సమీస్తున్న కొద్దీ బీఆర్‌ఎస్‌, బీజేపీ బంధం అంతర్గతంగా బలపడు తున్నది. పైకి రాజకీయ విమర్శలు ఒకరిపై మకో కరు చేసుకుంటున్నా, లోపల అలరుబలరు కొనసాగుతు న్నట్టు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నువ్వు తిట్టినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తా పద్ధతిలో గులాబీ, కమలం పార్టీల న నేతల వ్యవహారం నడుస్తున్నది. నిధుల్లేకపోవడంతో రాష్ట్రంలోని భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తీవ్ర ఆలస్యమవుతున్నదని ఉన్నతాధికారులు చెబుతుంటే, ఇటీవల కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి మాత్రం గత తొమ్మిదేండ్లల్లో కేంద్రం నుంచి రూ. తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చినట్టుగా గొప్పగా ప్రకటించారు. భారీగా నిధుల కేటాయింపు ప్రకటనలే తప్ప, ఆచరణ అంతంతే. సాగు నీటి శాఖ, రోడ్లుభవనాల శాఖ, భగీరథ, విద్యాశాఖకు సం బంధించి అంశాల్లో తెలంగాణకు పూర్తిగా మొండిచేయి చూపుతున్నది. సుమారు లక్ష కోట్లకుపైగా నిధులు వస్తే గానీ, వచ్చే మూడేండ్లల్లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం లేదని సాగునీటి శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు కుండబద్దలు కొడుతున్నారు. రకరకాల నిబంధనలు, మార్గ దర్శకాల పేరుతో అప్పులు తీసుకోవడానికి సైతం అడ్డు పడుతున్నది. నిధులు అందుబాటులో లేక వర్కింగ్‌ ఏజెన్సీ లకు సాగునీటి శాఖలో దాదాపు రూ. ఐదు వేల కోట్లకు పైగానే బకాయిలు చెల్లించాల్సి ఉందని సమాచారం.
రెండేండ్లుగా..
గత రెండేండ్లుగా రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టు పనులు నిధుల్లేక నెమ్మ దించాయి. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పదే పదే ఢిల్లీ వెళ్లడమే తప్పితే, పైసా విదల్చడం లేదు. ఉత్తచేతులతో తిరిగి రావల్సి వస్తున్నది. అప్పు లడిగితే ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ముందుకు తెచ్చి అప్పులు పుట్టకుండా చేసే పరిస్థితి. బీజేపీ అధికారం లో ఉన్న గుజరాత్‌కు మాత్రం గప్‌ చుప్‌గా వేల కోట్లు ధారాదత్తం చేస్తున్న సంగతి తెలి సిందే. కేరళ, మహా రాష్ట్ర, తెలంగాణ, పంజాబ్‌ రాష్ట్రాలను కేంద్రం పెడచెవిన పెడుతున్నది.
రూ.1.18 లక్షల కోట్లేవి ?
రాష్ట్రంలోని జాతీయ రహదారులకు సంబంధించిన నిధులను భారీగానే పెండింగ్‌లో పెట్టింది. ప్రస్తుతం జరుగుతున్న పనులకుగాను రూ.1.18 లక్షల కోట్లు అవసరం. ఇచ్చింది మాత్రం కేవలం రూ. 18 వేల కోట్లే. దీంతో జాతీయ రహదారుల అథారిటీ శాఖ (ఎన్‌హెచ్‌ ఏఐ) తల పట్టుకుంటున్నది. పదే పదే లేఖలు రాస్తున్నా, కేంద్రం నుంచి స్పందన రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. ఈ శాఖలోనూ రూ.రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇక పోతే మిషన్‌ భగీరథలోనూ. రూ. 800 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. గతంలో నిటిఅయోగ్‌ భగీరథ ప్రాజెక్టు రూ. 17 వేల కోట్లు ఆర్థి సాయం చేయాలని సూచించినా మోడీ సర్కారు పట్టించుకోలేదు. ఇటీవల కేంద్ర విద్యాలయ్యాలను దేశంలో పలురాష్ట్రాలకు మంజూరు చేసింది. తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపింది. ఏండ్ల తరబడి నిధులు ఇవ్వకుండా, కేంద్రీయ విద్యాలయ లాంటి సంస్థలను సైతం మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నా బీఆర్‌ఎస్‌ సర్కారు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. రాజకీయ విమర్శలు మినహా అభివృద్ధి కోసం కేంద్రంతో తలపడేందుకు ససేమిరా అనే విధానాన్ని అనుసరించిడం గమనార్హం.