– ప్రభుత్వం అంగన్‌వాడీ
– ఉద్యోగులతో చర్చలు జరపాలి
– వ్యకాస జిల్లా అధ్యక్షులు యు.బుగ్గప్ప
నవతెలంగాణ-యాలాల
మండలంలోని వివిధ గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రా ల తాళాలు ఐసీడీఎస్, వివిధ శాఖల అధికారులు పగల గొట్టడం సరికాదని రాష్ట్ర వ్యకాస జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆయన అంగన్‌వాడీ ఉద్యోగులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 35 ఏండ్లుగా అంగన్‌వాడీ ఉద్యోగులు ప్రభుత్వానికి పేద ప్రజలకు మధ్య వారదిగా ఉంటూ పని చేస్తున్నారన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కారం చేయాల్సిన అధికారులే కొత్త సమ స్యను సృష్టిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్ వాడీ ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరి ష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని యెడల అంగన్‌వా డీ ఉద్యోగుల సమ్మె మరింత ఉదృతం చేస్తామని హెచ్చ రించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల అంగన్‌వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు.