ఒంటి కాలిపై నిలబడి ఆశాల నిరసన

– 6వ రోజు కొనసాగిన సమ్మె
నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలో ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మె శని వారానికి 6వ రోజుకి చేరింది ఈ సందర్భంగా ఒంటి కాలి పై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశా వర్కర్లను పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్య కర్తలు అనేక పని ఒత్తిడి తట్టుకొని నిత్యం సేవలు అంది స్తుంటే ప్రభుత్వం వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుం దని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతన నిర్ణయం చేయా లని ఆందోళన చేస్తుంటే నిర్లక్ష్యం వహిస్తూ అందరిని రోడ్ల మీద పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్చించి నిర్ణయం చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.18 వేలు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించా లని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు తది తరులు పాల్గొన్నారు.