రాజకీయాలకు అతీతంగా కేటీఆర్‌ పర్యటనను విజయవంతం చేయాలి

– రూ.1400 కోట్లతో నల్లగొండ అభివద్ధికి కషి
– మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో చైర్మెన్‌్‌ మందడి సైదిరెడ్డి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
నల్లగొండ పట్టణ సుందరీకరణ కోసం 1400 కోట్ల రూపాయలను వెచ్చించి, పనులు పూర్తి చేయించి వాటి ప్రారంభోత్సవాలకు అక్టోబర్‌ 2న నల్గొండ పట్టణానికి వస్తున్న ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కు ప్రజలు, ప్రజా ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలపాలని, సభను విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి కోరారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ గత ఎన్నికల హామీల్లో భాగంగా నల్లగొండని దత్తత తీసుకుంటానని చెప్పి అందులో భాగంగా 1400 కోట్ల రూపాయలను వెచ్చించారని తెలిపారు. నల్లగొండ పట్టణంలో వివిధ పనులను చేపట్టామని దాదాపు పనులు పూర్తి కావచ్చని వివరించారు. ఉదయ సముద్రం ఆధునీకరణ పనులు, ట్యాంక్‌ బండ్‌, తదితర పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అమత్‌ 2.0 కింద 216 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని వీటితో దేవరకొండ రోడ్డు ప్రాంతంలో త్రాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుందని తెలిపారు. ఇవే కాకుండా మరి కొన్ని అభివద్ధి పనులకు, వార్డుల అభివద్ధి కోసం 87 కోట్ల నిధులను ముఖ్యమంత్రి కెసిఆర్‌ కేటాయించారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ పట్టణ అభివద్ధికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డికషి చేస్తున్నారని అన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారని తెలిపారు. సోమవారం నిర్వహించే ప్రగతి నివేదన సభను జయప్రదం చేయాలని కోరారు.
అధికారిని సరెండర్‌ చేయండి…
నీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ పలువురు కౌన్సిలర్లు ఫ్ల కార్డులు చూపుతూ నిరసన తెలిపారు. సమస్యలను పరిష్కారం చేయలేని మున్సిపల్‌ శాఖ ఈఈ రాములు, మాకు అవసరం లేదంటూ అధికారిని సరెండర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.
మురుగు కాలువలు తీయడానికే పనికొస్తారు…
నల్లగొండ పట్టణంలోని కౌన్సిలర్లు దేనికి పనికిరారని, కౌన్సిలర్లను అత్యంత హీనంగా చూస్తున్నారని, కేవలం మురుగు కాలువలు తీయడానికే పనికి వస్తారని 8వ వార్డు కౌన్సిలర్‌ పిల్లి రామరాజు యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులలో ఒక్క పని కూడా జరగడం లేదని, నిధులను కేటాయించుకోవడంలో కౌన్సిలర్లు పూర్తిగా విఫలమవుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్‌ కు కాంగ్రెస్‌, బిజెపి కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.