మొహమ్మద్ ప్రవక్త  ప్రవచనాలు విష్వశాంతికి మార్గదర్శాకాలు

-సిద్దిపేట లో భారీ శాంతి ర్యాలీ
నవ తెలంగాణ – సిద్దిపేట :  ఇస్లాం ధర్మం శాంతికి నిదర్శమని, శాంతి, సమసమాజ స్థాపనే ఇస్లాం ముఖ్య ఉద్దేశ్యం అని ఉలేమాలు, తంజీమ్ ఉల్ మసాజిద్ ఇంచార్జ్ అధ్యక్షులు నయ్యర్ పటేల్ అన్నారు. ఆయన ఒక్క ఇస్లాం ధర్మనీకె కాకుండా ఆయన మొత్తం మానవాళికి ప్రవక్త అన్నారు. మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పస్బానే మిల్లత్ మిలాద్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట లో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పట్టణంలోని బస్టాండ్ వద్దగల ఫిర్దౌస్ మస్జీద్ నుండి ప్రారంభమయిన ర్యాలి మెదక్ రోడ్డు గుండా మహాత్మాగాంధీ పార్క్ వద్దనుండి సాగుతూ ఇక్బాల్ మినార్ మీదుగా ముస్తాబద్ చౌరస్తా నుండి తిరిగి ఈద్గా వద్ద ఉన్న దర్గా లో ప్రార్థన చేసేవరకు కొనసాగింది. ప్రార్థనల అనంతరం సొసైటీ , ముస్లిం మత పెద్దలు మౌలానా ఖురేషి,మొహమ్మద్ రఫీ,మొహమ్మద్ గౌస్, కరీం పటేల్, మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త కారణ జన్ముడని , ఆయన చూపిన బాటలో నడిస్తే జీవితం అంత సుఖ శాంతులతో నడుస్తున్నది అన్నారు.  సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి, సీఐ లు కృష్ణ రెడ్డి, రవి కుమార్, రామకృష్ణ, భాను ప్రకాష్ ల  ఆధ్వర్యంలో భారీ బందోబస్తు
నిర్వహించారు.  ఏసీపీ సురేందర్ రెడ్డి  మాట్లాడుతూ ర్యాలీ శాంతియుతంగా నిర్వహించారని,  నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం అన్న వితరన కార్యక్రమం నిర్వహించారు.