వద్ధులకు ఎన్నికల కమిషన్‌ పోస్టల్‌బ్యాలెట్‌ అవకాశం

-1201 పోలింగ్‌ కేంద్రాలకు రాంపుల ఏర్పాటు అ కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్‌
80 ఏండ్లు దాటిన వద్ధులకు ఎన్నికల కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించిందని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రపంచ వయోవద్ధుల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాలని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ 80 సంవత్సరాలు దాటిన వయోవద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఎన్నికల అధికారులే ఇంటికి వచ్చి బ్యాలెట్‌ బాక్స్‌ లో వేసే విధంగా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. అయోవద్ధులు పోలింగ్‌ కేంద్రాలకు ఓటు వేయడానికి వాహన ఏర్పాట్లు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు .జిల్లాలోని 1 2 01 పోలింగ్‌ కేంద్రాలలో వద్ధుల కోసం ర్యాంపుల ఏర్పాటు, ఓటర్ల నిష్పత్తి ప్రకారం వీల్‌ చైర్ల ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వయోవద్ధుల పోషణ, సంరక్షణ చట్టంపై ఓయోవద్ధులందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి గురువారం వయోవద్ధులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించనున్నారని వయోవద్ధులందరూ ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు. వయోవద్ధులు తమ సమస్యలను మెయింటినెన్స్‌ ట్రిబ్యునల్‌ ఆర్డీవోలు, జిల్లా అప్పిలేటివ్‌ ట్రిబ్యునల్‌ కలెక్టర్‌ ద్వారా వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. తమ సమస్యలపై వయోవద్ధులు నేరుగా కార్యాలయంలో కలవచ్చని తెలిపారు. నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందే వరకు జలసాధన ఉద్యమం నడిపించి అందరినీ కాపాడిన బుచ్చెర్ల సత్యనారాయణను డిస్టిక్‌ ఎలక్షన్‌ బాండ్‌ అంబాసిడర్‌గా నియమించామన్నారు.ఈ కార్యక్రమంలో డిస్టిక్‌ ఎలక్షన్‌ బాండ్‌ అంబాసిడర్‌ బుచ్చెర్ల సత్యనారాయణ,డిస్టిక్‌ ఎలక్షన్‌ ఐకాన్‌ సీహెచ్‌.సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఓటు విలువను ఓటు వల్ల ఉపయోగాలను వారికి వివరించారు.ప్రపంచ వయోవద్ధుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీడబ్య్లూఓ జ్యోతిపద్మ, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, డీఈఓ అశోక్‌కుమార్‌,ఎంపీడీఓ శ్రీనివాస్‌,వయోవద్ధుల అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.రామచంద్రారెడ్డి,జి.విద్యాసాగర్‌ ఎస్‌ఏ హమీద్‌ఖాన్‌, వీరయ్య, అధికారులు, వయోవద్ధులు, సిబ్బంది పాల్గొన్నారు.