హుస్నాబాద్ పట్టణంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, బోజు రమాదేవి రవీందర్, బొజ్జ హరీష్, పెరుక భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లకావత్ మానస సుభాష్ గాంధీ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ జనగామ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.