ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీపై అగాహన సదస్సు

నవ తెలంగాణ- గోవిందరావుపేట:
తెలంగాణ వ్యాప్తంగా అక్టోబర్ 2న ఆయుష్మాన్ సభలు నిర్వహించాలని ఉద్దేశంలో భాగంగా   సోమవారం మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య శ్రీ పై అవగాహన సదస్సు జరిగింది. బుస్సాపూర్ సర్పంచ్ సింగం  శ్రీలత అధ్యక్షతన ఈ సభ నిర్వహించడం జరిగింది. గాంధీజీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి సర్పంచ్ సింగం శ్రీలత ఉప సర్పంచ్ బేతి దేవేందర్ రెడ్డి  పూలమాలవేసి, గాంధీజీ ఆశయాలను కొనసాగించాలన్నారు..ఆరోగ్య మిత్రలు కొండా రమేష్ , కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి  లు హాజరై రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ  తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో ఐదు లక్షల వరకు ఉచిత వైద్యాన్ని ఎంపైనల్డ్ ఐనా హాస్పిటల్ లో  పొందవచ్చని  తెలిపారు.ఆధార్ కార్డు కార్డు ఆధార్ లింక్ ఉన్న మొబైల్ ను తమ వెంట మీసేవ వద్దకు  తీసుకెళ్లాలని  సూచించారు.అదేవిధంగా మొత్తం 1672 రకాల చికిత్సలకు ఉచితంగా ఆరోగ్యశ్రీలో చికిత్స చేయబడునని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1336 హాస్పిటల్ లు ఆయుష్మాన్ భారత్ లో   భారత్ లో ఉన్నాయని అన్నారు. గుండె ఊపిరితిత్తులు కిడ్నీకి సంబంధించిన పెద్ద పెద్ద రోగాలకు కూడా ఈ ఆయుష్మాన్ వర్తిస్తుందని తెలిపారు. ఇంటిలో ఉన్న వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున ఆయుష్మాన్ భారత్ కార్డు వస్తుందని తెలిపారు. ఈ ఐదు లక్షల అనేది  కార్డులో ఉన్న సభ్యులందరికీ వర్తిస్తుంది అని తెలిపారు.ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే మా నెంబర్ కాల్ చేయవచ్చు అని కూడా నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో  భేటీ దేవేందర్ రెడ్డి, అశోక్ పంచాయతీ కార్యదర్శి, వార్డ్ మెంబర్లు , ఆరోగ్యశ్రీ బెనిఫిషర్లు పాల్గొన్నారు .