అంగన్వాడీ ఉద్యోగుల నిరసన

నవతెలంగాణ- పెద్దవంగర:
రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పసుల స్వరూప అన్నారు. సోమవారం మండల పరిధిలోని వడ్డెకొత్తపల్లి గ్రామంలో అంగన్వాడీ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని గ్రామంలోని గాంధీ విగ్రహానికి అందజేశారు. ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో పని చేస్తున్నామని, కనీస వేతనం రూ. 26వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం, రిటర్మెంట్‌ బెనిఫిట్స్‌, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు మంజుల, ఝాన్సీ, రేణుక, అంబిక, మమత, యాదమ్మ, యాకలక్ష్మీ, ఎల్లమ్మ, ఐలమ్మ, ఐలమ్మ, శోభ తదితరులు పాల్గొన్నారు.