– ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
– ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన అంగన్‌వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు
– మండల కేంద్రంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ-యాచారం
అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం సమ్మెలో భాగంగా యాచారం మండల కేంద్రంలో వారు సీఐ టీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. మండల పరిధిలోని అభి వృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కు అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యల పరిష్కరించాలని సీఐట ీయూ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. వారు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాటా ్లడుతూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీనిచ్చారు. అంగన్ వాడీలకు ఉద్యోగ భద్రత, ఆశా వర్కర్లకు కనీస వేతనం, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య, అంగన్‌వాడీ, ఆయాల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బొడ్డు రాజలక్ష్మి, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.