– కాకునూరు సర్పంచ్ గండ్ర లక్ష్మమ్మ
నవతెలంగాణ-కేశంపేట
మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కేశంపేట మండలం కాకునూరు గ్రామ సర్పంచ్ గండ్ర లక్ష్మమ్మ అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను పోచమ్మ చెరువు, దోవోనిబాయి చెరువు, నాన్ చెరువు, ఎర్రకుంట కల్వకుంటలలో మత్స్యకారులు చేపలను వదిలారు. చేపలు వదిలే కార్యక్రమంలో మత్స్యకారులతో కలిసి పోచమ్మ చెరువులో ఆమే చాప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే మత్స్యకారుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. కార్యక్రమంలో కాకునూరు మత్స్యకార సొసైటీ అధ్యక్షులు ఇంజమూరి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, సభ్యులు నర్సింలు, మల్లేష్ కష్ణయ్య, కోటీశ్వర్, రాములు, కష్ణ తదితరులు పాల్గొన్నారు.