నవతెలంగాణ-వికారాబాద్ రూరల్
అంగన్వాడీల సమ్మె సోమవారానికి 22వ రోజుకు చేరుకుంది. గాంధీ జయంతి సందర్భంగా వికారాబాద్ జి ల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద గాంధీ చిత్రప టానికి అంగన్వాడీలు పూలమాల వేసి నిరసన తెలిపా రు. ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు జిల్లా కార్యదర్శి భారతి లక్ష్మిలు, సమ్మెకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ నాయకులు మద్దతు తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జిల్లా పి మల్లేశం నాయకులు మహిపాల్, సుద ర్శన్, రవి, శ్రీనివాస్, లాలయ్య, రవికుమార్, హరికృష్ణ, లక్ష్మయ్య, రాజు అంగన్వాడీ టీచరు,్ల హెల్పర్లు పాల్గొన్నారు.