బీఆర్‌ఎస్‌ పార్టీలో అగ్రవర్ణాలకెే ప్రాధాన్యం

– ఓటమి భయంతోనే నర్సాపూర్‌ టికెట్‌ పెండింగ్‌
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌ యాదవ్‌
నవ తెలంగాణ-నర్సాపూర్‌
బీఆర్‌ఎస్‌ పార్టీలో అగ్రవర్ణాలకెే అధిక ప్రాధాన్యం ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌ యాదవ్‌ అన్నారు. సోమ వారం నర్సాపూర్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో అగ్రవర్ణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప, బడుగు బలహీన వర్గాలను పట్టించుకోవడంలేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వ భూములను అమ్ముతున్నారన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను అమ్మలేదని కేవలం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మాత్రమే ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి నర్సాపూర్‌కు చేసిన అభివద్ధి శూన్యమని అభివద్ధి చేయలేదని ఉద్దేశంతో రాష్ట్రంలో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి కేవలం నర్సాపూర్‌ స్థానాన్ని మాత్రమే పెండింగ్‌లో పెట్టారన్నారు. మహిళా కమిషన్‌ చైర్పర్సన్‌ సునీత రెడ్డి రాష్ట్రానికి చైర్మన్‌లా కనిపించడం లేదని కేవలం నర్సాపూర్‌ నియోజకవర్గానికి మాత్రమే మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌గా కనిపిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి చెందుతామన్న భయంతోనే సీఎం కేసీఆర్‌కు జ్వరం పట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సతీష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.