నవతెలంగాణ-నర్సాపూర్
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి టీచర్లు గత 22 రోజులుగా సమ్మె చేస్తున్న ప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడంతో సోమవారం నర్సాపూర్ పట్టణంలోని గాంధీ విగ్రహానికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార కమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ ,అంగన్వాడీలు ధనలక్ష్మి, నాగరాణి స్వర్ణలత జనాభారు మంజుల, షహనాజ్, లక్ష్మి, తదితరులు ఉన్నారు.