పారదర్శకంగా ‘డబుల్‌’ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక

– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
– కొల్లూరులో మూడో విడత ఇళ్లు పంపిణీ
నవతెలంగాణ-రామచంద్రాపురం
తెల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని కొల్లూరులో సోమవారం మూడో విడతగా 6067 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ లబ్ధిదా రులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. పారదర్శకంగా డబుల్‌ బెడ్‌ రూంల ఎంపిక ప్రక్రియ జరుగుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదలకు డబుల్‌ బెడ్రూంలు కట్టిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నా యన్నారు. జిహెచ్‌ఎంసీ ద్వారా రూ.9600 కోట్లతో లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించినట్టు తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. పటాన్‌చేరు నియోజ కవ ర్గంలో 28 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టడం సం తోషంగా ఉందన్నారు. అత్యంత ఖరీదైన కొల్లూరు ప్రాం తంలో సీఎం కేసిఆర్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టి ఇస్తునా ్నరన్నారు. ప్రజలు ప్రభుత్వం చేస్తున్న అభివద్ధి కార్యక్ర మాలను చూసి తమను ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రవ ుంలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ మంజుశ్రీ, కలెక్టర్‌ శరత్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ రెడ్డి, పుష్ప నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.