హారు నాన్న నుంచి గాజు బొమ్మ..

Glass doll from Haru's father..నాని నటిస్తున్న తాజా చిత్రం ‘హారు నాన్నా’. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజికల్‌ జర్నీ ‘సమయమా..’తో ప్రారంభమైంది. ఈ పాటలో లీడ్‌ పెయిర్‌ -నాని, మణాల్‌ ఠాకూర్‌ మధ్య బ్యూటీఫుల్‌ కెమిస్ట్రీని చూపించింది. ఇక లేటెస్ట్‌గా ఈ చిత్రంలోని సెకండ్‌ సింగిల్‌ ‘గాజు బొమ్మ..’ను ఈనెల 6న రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. నాని, కియారా ఖన్నా ముచ్చటగా మాట్లాడుకుంటున్న వీడియో ద్వారా ఈ విషయాన్ని అనౌన్స్‌ చేశారు. ‘లవ్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశావ్‌.. మరి మన సాంగ్‌? అని బేబీ కియారా నానిని అడుగుతుంది. నాని పాపని గాజు బొమ్మ అని పిలుస్తాడు.
తండ్రీ కూతురు నేపథ్యంలో ఈ పాట ‘హారు నాన్నా’ సోల్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్‌ చెరుకూరి (సివిఎం), డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.