1960వ దశకంలో ఢిల్లీ అధికారం కోసం జరిగే భారీ యుద్ధ కథతో ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ సిరీస్ రూపొందింది. అర్నాబ్ రే రాసిన ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ: అసెన్షన్’ అనే పుస్తకం ఆధారంగా దర్శకుడు మిలన్ లుత్రియా దర్శకత్వంలో ఈ సిరీస్‌ను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈనెల 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కావడానికి ఈ సిరీస్ సిద్ధంగా ఉంది.
ఈ సిరీస్ ప్రేక్షకుల్ని ఒక ఆసక్తికరమైన ప్రయాణంలో తీసుకెళ్లడానికి అన్ని రకాల హంగులతో రూపొందింది. ఇందులో తాహిర్ రాజ్ భాసిన్, అంజుమ్ శర్మ, వినరు పాఠక్, నిశాంత్ దహియా, అనుప్రియా గోయెంకా, మౌని రారు, హర్లీన్ సేథి మెహ్రీన్ పిర్జాదా కీలక పాత్రల్లో నటించారు. 60వ దశకంలోని పాతకాలపు కాలపు మాయాజాలాన్ని పునఃసష్టిస్తూ ఢిల్లీలోని అతిపెద్ద అక్రమ ఆయుధాల వ్యాపారి జగన్ సేథ్తో కలిసి పనిచేసే అర్జున్ భాటియా కథే ‘సుల్తాన్ ఆఫ్ ఢిలీ’్ల. అధికారం కోసం జరిగే భారీ యుద్ధం ఇది. దీని గురించి దర్శకుడు మిలన్ లుత్రియా మాట్లాడుతూ, ‘మా టీజర్‌కి ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. ప్రేక్షకులు ఈ సిరీస్‌ని పూర్తి స్థాయిలో ఎంజారు చేస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.