చాంప్స్‌ అర్చిత, చాన్వి

హైదరాబాద్‌ : ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ స్పోర్ట్స్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎస్‌ఎస్‌ఓ) నేషనల్‌ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌ విజేతలుగా గాడియం స్కూల్‌ షట్లర్లు అర్చిత, చాన్వి నిలిచారు. బాలికల డబుల్స్‌ అండర్‌-14లో అర్చిత నితిన్‌ జోశి, చాన్వి పెట్టాలు పసిడి సాధించగా.. జయ, రేవలు సిల్వర్‌ మెడల్‌ అందుకున్నారు. బాలుర సింగిల్స్‌ అండర్‌-14లో సత్య దీపక్‌, సాయినాథ్‌, మహ్మద్‌ అయాన్‌లు విజేతలుగా నిలిచారు. విజేతలకు ఐఎస్‌ఎస్‌ఓ ప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు.