
ఆశ వర్కర్లు నిర్వహించే సమ్మె భాగంగా 10వ రోజు గురువారం బిక్షాటన చేస్తూ విన్నూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్ మండల అధ్యక్షురాలు నాలి జయసుధ మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో ఆశా వర్కర్లు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదనచించారు. తీవ్ర కరోనా సమయంలో ఎంతో సేవ చేశామని, ఆశాల సేవలు అమోఘం అంటూ మెచ్చుకున్న ప్రభుత్వం 9750 జీతంతో సరిపెట్టిందన్నారు. చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం రూ. 18000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంకిడి రమాదేవి, కె నాగమణి, రజిని, రమాదేవి, పద్మ 20 మంది ఆశాలు తదితరులు పాల్గొన్నారు.