కులగణనతో బీజేపీకీ కలవరం

BJP is also worried about caste censusఅనేక అవరోధాలను అధిగమిస్తూ బీహార్‌ ప్రభుత్వం నిర్వహించిన కులగణన దేశ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కులగణనకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే మద్దతు తెలపగా బీజేపీ మాత్రం సందిగ్థంలో పడింది. బీహార్‌లో వివిధ కులాల జనాభాపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో దేశంలో ఏ కులం వారు ఎంత సంఖ్యలో ఉండవచ్చునన్న విషయంపై ఊహాగానాలు వినవస్తున్నాయి. ఎందుకంటే దేశంలోని పలు ప్రాంతాలలో కులాలే రాజకీయాలను ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అనేక రాష్ట్రాలలో సం’కుల’ సమరం తప్పడం లేదు.
న్యూఢిల్లీ : దేశంలో పది సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన జనగణనను సకాలంలో నిర్వహించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైంది. 2021లో జనగణన జరగాల్సి ఉండగా కోవిడ్‌ కారణంతో వాయిదా పడింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడినప్పటికీ ప్రభుత్వం మాత్రం జనాభా లెక్కల సేకరణకు శ్రీకారం చుట్టలేదు. అదే సమయంలో బీహార్‌లోని నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం కులగణనను విజయవంతంగా పూర్తి చేసింది. తద్వారా జాతీయ స్థాయిలో సైతం కులగణన జరపవచ్చునని రాజకీయ సంకేతాలు పంపింది. ఒడిషా, జార్ఖండ్‌ రాష్ట్రాలలో ఇప్పటికే సామాజిక, ఆర్థిక కుల సర్వేలు జరుగుతున్నాయి. మరి దేశంలో అలాంటి కసరత్తు ఎందుకు చేపట్టలేకపోతోందో బీజేపీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఓబీసీల డిమాండ్‌ పెరిగితే…
ఇప్పటివరకూ బీజేపీ నేతలు హిందూత్వ వాదనను గట్టిగా విన్పించారు. అయితే ఇప్పుడు వారిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశ జనాభాలో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిపి 84% వరకూ ఉండవచ్చునని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇది బీజేపీని కలవరపెడుతోంది. మత ప్రాతిపదికన ప్రజలను విభజించి రాజకీయ లబ్ది పొందుతున్న బీజేపీకి ఇది కొరుకుడు పడని విషయమే. ఎందుకంటే హిందూ మతంలోని అనేక సామాజిక, ఆర్థిక అంతరాలు…. అగ్రవర్ణ ఆధిపత్యాలు బటబయ లవుతాయి. కనుక హిందువులంతా ఒకటేనని నినదిస్తున్న మనువాద అనుచరులకు కులగణన అనేది మింగుడు పడని అంశం.2019లో మోడీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించింది. న్యాయ వ్యవస్థ కూడా దీనిని ఆమోదించి, రిజర్వేషన్లపై అమలులో ఉన్న 50 శాతం సీలింగ్‌ను తొలగించింది. బీహార్‌ తరహాలోనే దేశవ్యాప్తంగా కులగణన జరిపితే ఓబీసీల జనాభా ఎంతో కచ్చితంగా తేలిపోతుంది. అప్పుడు జనాభాకు అనుగుణంగా తమకు రిజర్వేషన్లు ఇవ్వాలని వారు పట్టుపట్టే అవకాశం ఉంది. దేశ జనాభాలో ఓబీసీలు 63.13 శాతం ఉండవచ్చునని ఓ అంచనా. వీరికి ఇప్పుడు కేవలం 27శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయి. వాటిని పెంచితే దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. ఇది హిందూ ఆధిపత్య వర్గాలు
బలం పెంచుకుంటున్న ప్రతిపక్షం
గత దశాబ్ద కాలంలో ఓబీసీలలో బీజేపీ బలం కొంతమేర పెరిగింది. దానిని నిలుపుకుంటేనే రాబోయే లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి పక్షాలు ఓబీసీలలోకి చొచ్చుకుపోతు న్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఓబీసీలలో 44% మంది బీజేపీకి ఓటు వేశారు. కొన్ని రాష్ట్రాల జనాభాలో ఓబీసీలే అధికం. వివిధ రాష్ట్రాలలో ముఖ్య మంత్రి పదవులు నిర్వహిస్తున్న సిద్ధరామయ్య, స్టాలిన్‌, పినరయి విజయన్‌, భూపేష్‌ బాఘేల్‌, అశోక్‌ గెహ్లాట్‌ ఓబీసీలే. అయితే ఓబీసీలలో కొన్ని కులాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రాజస్థాన్‌ లో తన కులానికి పెద్దగా ప్రాధాన్యత లేదని ముఖ్య మంత్రి గెహ్లాట్‌ గత వారం వ్యాఖ్యానించారు కూడా. ఇదిలావుంటే మోడీ ప్రభు త్వం ఓబీసీలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఇటీవల గణాంకాలతో సహా ఆరోపించారు. కేంద్రంలో 90 మంది కార్యదర్శులుంటే వారిలో ముగ్గురు మాత్ర మే ఓబీసీలని గుర్తు చేశారు. తాను ఓబీసీల పార్టీనని గొప్పలు చెప్పుకునే బీజేపీకి ఈ గణాంకాలు మింగుడు పడడం లేదు.
ముస్లిం రిజర్వేషన్లపై తప్పటడుగులు
ముస్లింలకు వ్యతిరేకంగా దేశ ప్రజలందరినీ సంఘటితపరచి, తద్వారా ఎన్నికలలో ప్రయోజనం పొందాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తో ంది. ముస్లింలకు రిజర్వేషన్లు అవసరమే లేదని వితండవాదం చేస్తోం ది. అయితే అదృష్ట వశాత్తూ ఆ పార్టీ పాచిక పార లేదు. ముస్లింలలో వెనుక బడిన వారికి రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వ కూడదని సుప్రీంకోర్టు ప్రశ్నిం చింది. కర్నాటకలో మొన్నటి వరకూ అధికారం చెలాయించిన బసవ రాజ్‌ బొమ్మై ప్రభుత్వం సుప్రీం కోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వరాదన్న తన విధానాన్ని పక్కన పెట్టింది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు.
ఉప-వర్గీకరణ జరిపితే…
ఓబీసీలకు సంబంధించి జాతీయ స్థాయిలో రోహిణి కమిషన్‌ ఇచ్చిన నివేదిక, ఉత్తరప్రదేశ్‌లో సామాజిక న్యాయ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం బీజేపీ పరిశీలనలో ఉన్నాయి. ఈ రెండూ ఓబీసీలలో ఉప-వర్గీకరణ జరపాలని సిఫార్సు చేశాయి. అయితే ఒకప్పుడు జనసంఫ్‌ు దీనిని వ్యతిరేకించింది. అయినప్పటికీ బీహార్‌, కేరళ, కర్నాటకలో దీనిని అమలు చేశారు. ప్రస్తు తం 11 రాష్ట్రాలలో ఓబీసీలలో ఉప-వర్గీకరణ అమలులో ఉంది. 2019 ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. 2019లో బీజేపీకి వచ్చిన ఓట్లలో 44% ఓట్లు ఓబీసీలలోని అన్ని కులాల వారివీ కలిసి ఉన్నా యి. ఇప్పుడు ఓబీసీలలో ఉప -వర్గీకరణ జరి పితే బీజేపీకి లేనిపోని తల నెప్పులు ఎదుర వుతాయి. ఓబీసీలను ఓ తరగతి గా విభజించేం దుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వర కూ విజయవంతమే అయ్యాయి. ఆ పార్టీ చిన్న చిన్న ఓబీసీలను ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఓబీసీలు సంఘటితం కాకుండా ప్రయత్ని స్తోంది.
ఆర్థిక సమాచారం ఏది?
సర్వే వివరాలు బయటపెట్టని నితీష్‌ ప్రభుత్వం
దేశంలోనే మొట్టమొదటిసారిగా బీహార్‌ లోని నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం కులగణన నిర్వ హించి, ఫలితాలు ప్రకటించింది. అయితే కుల గణనతో పాటు సామాజిక- ఆర్థిక సమాచా రాన్ని కూడా సేకరించినప్పటికీ దానిని బయట పెట్టలేదు. ఇందుకు నితీష్‌ ప్రభుత్వం ఎలాంటి కారణాలు చెప్పడం లేదు. కులగణన వివరాలు వెల్లడించి, సామాజిక ఆర్థిక సర్వే సమాచారాన్ని గోప్యంగా ఉంచడం వల్ల ఏ కులం వారు అభివృద్ధి చెందారో, ఏ కులం వెనుక బడి ఉన్నదో తెలియడం లేదు. కుల గణాంకాలు కేవలం రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగ పడతాయి తప్పించి వాటివల్ల వేరే ఉపయోగం ఏమీ ఉండదు. కులాల ఆర్థిక పరిస్థితులు తెలిసి నప్పుడే దానికి అనుగుణంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందించుకొని, అమ లు చేయడం సాధ్యపడుతుంది. ఆర్థిక సమాచా రాన్ని బయటపెడితే కుల రాజకీయాల స్థానంలో ‘ఆర్థిక’ రాజకీయాలు ముందుకు వస్తాయి. ఆయా కులాల వారు తమకు ఎన్నికల రాజకీ యాల్లో సముచిత ప్రాధాన్యత కల్పించాలని, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తారు. కులగణన వివరాలు విడుదల చేసిన తర్వాత ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష పార్టీలు సామాజిక-ఆర్థిక సర్వే వివరాలు కూడా బయటపెట్టాలని డిమాండ్‌ చేశాయి. మైనారిటీ లలో చీలిక తెచ్చేందుకు నితీష్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కొన్ని పార్టీలు ఆరోపించాయి కూడా. దీనిపై నితీష్‌ సమాధాన మిస్తూ 45 రోజుల్లో ఆర్థిక సర్వే వివరాలు బయటపెడతామని చెప్పారు. నవంబర్‌- డిసెంబర్‌ నెలల్లో జరిగే బీహార్‌ శాసనసభ శీతాకాల సమావేశాల్లో సామాజిక-ఆర్థిక సర్వే వివరాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీహార్‌ రాజ కీయాల్లో ఓబీసీల ఆధిపత్యం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఓబీసీల జనాభా 10% పెరిగింది. ఓబీసీలలో కుర్మీలు, యాదవుల సంఖ్య అధికం. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కుర్మీ కాగా ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ యాదవ కులానికి చెందిన వారు.
అణచివేయడం కోసమే
పదేండ్లకోసారి జరిగే జనగణన దేశ చరిత్రలో ఎన్నడూ ఆగలేదు…. 1881లో జనాభా లెక్కలు మొదలైనప్పటి నుంచి ఎప్పుడూ వాటిని నిర్వహించకుండా ఉండలేదు… ప్రపంచ యుద్ధాల సమయంలోనూ వాటిని ఆపలేదు. కానీ మోడీ ఆ పని చేశారు! మనువాద సామాజిక అణచివేతను బలపరిచేందుకు కుల గణనను తిరస్కరిస్తున్నారు. అదే సమయంలో ఓబీసీల ప్రయోజనాలను కాపాడేది తామేనని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ క్రూరమైన కపటత్వాన్ని ఓడించాలి.
– సీతారాం ఏచూరి, ప్రధాన కార్యదర్శి సీపీఐ(ఎం)