ఎస్సీ బి  స్కూల్ హాస్టల్లోని సమస్యలు పరిష్కరించాలి..

– ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్

నవతెలంగాణ -కంటేశ్వర్
ఎస్సీ బి స్కూల్ హాస్టల్ లోని సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో గల న్యల్కాల్ రోడ్ వద్ద గల ఎస్సీ బి స్కూల్ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సుపరిండెంట్ జావేద్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ ఎస్సీ బీ హాస్టల్ లో విద్యార్థులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి, హాస్టల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే అక్కడ పర్యవేక్షణ సంబంధించి అనేక లోపాలు ఉన్నాయి అని ,అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం, హాస్టల్ కు వాచ్ మెన్ ఉన్నప్పటికీ తాను పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వలన విద్యార్థులు ప్రతిరోజూ రాత్రి సమయంలో హాస్టల్ బయటకు వెళ్లడం జరుగుతుందని దీన్ని అదుపు చేయడంలో అక్కడి హాస్టల్ వార్డెన్ కూడా విఫలమవుతున్నాడని గతంలో ఫిర్యాదు చేసిన ఫలితం మాత్రం శూన్యం అని అన్నారు. అలాగే వాచ్ మెన్ ఇతర శాఖ(పంచాయతీరాజ్) సంబందించిన వారు అని వారికి విధినిర్వహణ గురుంచి చెప్తున్నమని మాటదాటవేసే పని కాకుండా సమస్య పరిష్కరిస్తే బాగుంటుందని అన్నారు.అదే విధంగా దోమల బెడద మరియు పాములు లాంటివి రావడం వలన విద్యార్థులు భయాందోనలతో సతమతమవుతున్నారని , అలాగే చిన్న చిన్న పిల్లలు ఉంటున్న హాస్టల్ లో ఈ మధ్య కాలంలో భోజనం సరిగ్గా వండటం లేదని ,విద్యార్థులు చెప్తున్న పట్టించు నాథుడు లేడని జరగరాని సంఘటన జరగకముందే , అధికారులు స్పందించి వెంటనే అక్కడ సీసీ కెమెరాలు, అదేవిధంగా వీధిలైట్లు ఏర్పాటు చెయ్యాలని అలాగే ఆ హాస్టల్ వాచ్ మెన్ పై చర్యలు తీసుకోకపోతే హాస్టల్ విద్యార్థులతో ధర్నా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు సందీప్ మరియు నగర నాయకులు శివ ,కార్తీక్ , దీపక్ తదితరులు పాల్గొన్నారు.