
హుస్నాబాద్ పట్టణంలోని అపోలో ఒకేషనల్ జూనియర్ కళాశాలకు చెందిన ధరావత్ తిరుపతి టిఎస్ ఎస్పిడిసిఎల్ జూనియర్ లైన్మెన్ ఉద్యోగ అభ్యర్థుల జాబితాలో ఉద్యోగం సాధించగా అపోలో వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గణేష్ గురువారం విద్యార్థిని ఘనంగా సన్మానించారు. వృత్తి విద్య కోర్సులతో విద్యార్థులు త్వరగా ఉద్యోగాలు సాధించి జీవితం స్థిరపడడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మమత, ప్రవీణ్, రాజేంద్రప్రసాద్, సుజాత, అఖిల అధ్యాపకేతర బృందం శేఖర్, అరుణ పాల్గొన్నారు.