గ్రామ యువతకు ఆదర్శం ప్రవీణ్ కుమార్ 

నవతెలంగాణ- దుబ్బాక రూరల్ :సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామానికి చెందిన కండ్లకోయ ప్రవీణ్ కుమార్ ఇటీవల పోలీస్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత పొంది ఉద్యోగం సాధించాడు. ఈ సందర్బంగా గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పర్శరాములుతో కలిసి దుబ్బాక జెడ్పీటీసీ కడతాల రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ  రామవరం మాధవి చంద్ర శేఖర్ రెడ్డి ప్రవీణ్ ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి పోలీస్ ఉద్యోగం సాధించడం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వం ప్రకటికంచిన నోటిఫికేషన్లో ఉద్యోగం రావాలని పట్టుదలతో కృషి ప్రవీణ్ కు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. వీధి నిర్వహణలో సక్రమంగా పని చేసి మండలానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు . గ్రామంలోని యువత ప్రవీణ్ ని ఆదర్శంగా తీసుకుని ఉద్యోగాలు పొందాలని సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ లు సూచించారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ తనకు ఉద్యోగం రావడానికి తన తల్లిదండ్రుల శ్రమ దాగి ఉందన్నారు. గ్రామంలోని యువత ప్రవీణ్ ని ఆదర్శంగా తీసుకుని  ఉద్యోగాలు పొందాలని సూచించారు. తదనంతరం గ్రామ పంచాయతీ కార్యలయం ఎదుట ప్రతి యేడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు దసరా కానుకగా అందించే బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సెక్రటరీ స్వామి, ఉప సర్పంచ్ మీస మల్లేశం, బాబాయ్ వెంకటేశం, బాలయ్య, యాదగిరి, శ్రీనివాస్, కోటి విజయ భాస్కర్, మహేందర్ తదితరులున్నారు