మహిళలను గౌరవించడం తెలంగాణ సంప్రదాయం

– రాయపోల్ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్.

నవతెలంగాణ- రాయపోల్
తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకొని తెలంగాణ సాంప్రదాయాలను కాపాడుకుంటూ మహిళను గౌరవించుకోవాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని రాయపోల్ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్  అన్నారు. గురువారం  రాయపోల్ మండల కేంద్రం, కొత్తపల్లి గ్రామాలలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేకం చేపట్టారని దానిలో భాగంగానే బతుకమ్మ పండుగకు మహిళలకు చీరల పంపిణీ చేసి, వారికి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అలాగే క్రిష్టియన్లకు క్రిస్మస్ పండుగకు, ముస్లింలకు రంజాన్ పండుగకు, కూడా బట్టలు పంపిణీ చేసి అన్ని  కుల, మతాల బేధాలు లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మున్నయ్య, రాయపోల్ సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి,  పంచాయతీ కార్యదర్శి శివకుమార్, వివో ఏ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.