
మండల పరిధిలోని 15గ్రామాలలో 47కోట్ల 09లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు, ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో 2కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మొత్తం 49 కోట్ల 09 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మండల పరిధిలోని ఆడపడుచులకు బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్ కిట్లను పంపిణి చేశారు. అదే విధంగా అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు వాటర్ బాటిల్లు, టిఫిన్ బాక్స్ లను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారికి ఆయా గ్రామాల ప్రజలు కోలాటాలు, డప్పు చెప్పుల్లు, డిజే పాటలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దండగలా ఉన్న వ్యవసాయాన్ని పండగలా మార్చిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. రైతుబంధు, భీమా, 24 గంటల కరెంట్, రైతు రుణమాఫీతో రైతులు ఆనందంగా రెండు పంటలు పండిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాల రూపకల్పన చేయడమే కాకుండా అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాల అమలు చేస్తూ అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత జరిగిన అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తోందని, పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు,ఎంపిపి మార్నేని మధుమతి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ, వైస్ ఎంపిపి మోహన్, జైపాల్ యాదవ్,నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావు, పాక్స్ చైర్మన్ వనం రెడ్డి, మండల రైతు బందు కన్వీనర్ సమ్మయ్య,వైస్ చైర్మన్ బాబు,మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి,మండల కో ఆప్షన్ సభ్యులు గుంశావలి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, అధికార ప్రతినిధి రవీందర్ పాల్గొన్నారు.