‘పది’లో గురుకులాల సత్తా ప్రయివేటు కంటే మెరుగ్గా ఫలితాలు

– వెనుకంజలో సర్కారు బడులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ రంగంలోని గురుకుల పాఠశాలలు సత్తాచాటాయి. తెలంగాణ గురుకులాలు 98.25 శాతం ఉత్తీర్ణత సాధించి యాజమాన్యాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఎస్సీ గురుకులాలు 95.24 శాతం, బీసీ గురకులాలు 95.03 శాతం, మైనార్టీ గురుకులాలు 94.66 శాతం, గిరిజన గురుకులాలు 92.93 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం. ప్రయివేటు పాఠశాలల్లో 90.9 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో వెనుకంజలో ఉన్నాయి. 72.39 శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. జిల్లా పరిషత్‌ బడుల్లో 79.14 శాతం ఉత్తీర్ణత వచ్చింది.

యాజమాన్యాల వారీగా ఉత్తీర్ణత వివరాలు 

యాజమాన్యం విద్యార్థుల హాజరు ఉత్తీర్ణత శాతం
తెలంగాణ గురుకుల 2,680 2,633 98.25
ఎస్సీ గురుకుల 18,000 17,144 95.24
బీసీ గురుకుల 18,001 17,106 95.03
మైనార్టీ గురుకుల 10,773 10,198 94.66
గిరిజన గురుకుల 7,337 6,818 92.93
మోడల్‌ స్కూళ్లు 18,213 16,629 91.3
ప్రయివేటు పాఠశాలలు 2,16,060 1,96,403 90.9
కేజీబీవీ 16,702 14,006 83.86
ఎయిడెడ్‌ 6,933 5,813 83.85
జిల్లా పరిషత్‌ 1,39,922 1,10,738 79.14
ఆశ్రమ పాఠశాలలు 8,254 6,411 77.67
ప్రభుత్వ పాఠశాలలు 21,495 15,561 72.39
మొత్తం 4,84,370 4,19,460 86.60