
నవతెలంగాణ-బెజ్జంకి :
బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలిపేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించినట్టు కరీంనగర్ జిల్లా పోరాట సమితి సభ్యులు దోనే వెంకటేశ్వర్ రావు, మానాల రవి తెలిపారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కార్యలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే దుద్ధిల్ల శ్రీధర్ బాబు, కమిటీ సభ్యులకు కరీంనగర్ జిల్లా పోరాట సమితి సభ్యులు వినతిపత్రమందజేశారు. బెజ్జంకి మండలంతో పాటు కోహెడ, హుస్నాబాద్ మండలాలను సైతం యథావిదిగా కరీంనగర్ జిల్లాలో కలిపేందుకు మేనిఫెస్టోలో చేర్చాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మేనిఫెస్టో కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేసినట్టు పోరాట సమితి సభ్యులు తెలిపారు. కరీంనగర్ పోరాట సమితి సభ్యుల వినతి మేరకు మద్దుతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నేతలకు వేంకటేశ్వర్ రావు,రవి కృతజ్ఞతలు తెలిపారు.