మాజీ సర్పంచ్ లకు రూ.10వేల పెన్షన్ అందజేయాలి

– మాజీ సర్పంచ్ ల మండల నూతన కార్యవర్గం ఎన్నిక
నవతెలంగాణ-తంగళ్ళపల్లి : మాజీ సర్పంచ్ లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల పెన్షన్ అందజేయాలని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు  బొడ్డు దేవయ్య అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం మాజీ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా దేవుని సుజాత నర్సయ్య, ఉపాధ్యక్షులుగా తీగల దుర్గయ్య, ప్రధాన కార్యదర్శిగా వాసాల వెంకటరామిరెడ్డి, కోశాధికారిగా చిలివేరి రాజేశ్వరి రాజు, సంయుక్త కార్యదర్శిగా అలువాల సుగుణ లక్ష్మణ్, కార్యదర్శిగా గజ్జెల స్వామి, ముఖ్య సలహాదారులుగా గుర్రం సత్తయ్య, ఆసాని సత్యనారాయణ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బొడ్డు దేవయ్య మాట్లాడుతూ… మాజీ సర్పంచులు ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాజీ సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మాజీ సర్పంచుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఏనాడు ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచ్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదంటే రానున్న ఎన్నికల్లో మాజీ సర్పంచ్ ల సత్త చూపెడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పాల్గొన్నారు.